ఇప్పటికీ అన్నపూర్ణా స్టూడియోస్ మా ఇల్లు లాంటిదే!: నాగ్ ట్వీట్ పై పూరీ జగన్నాథ్!

  • వర్మతో సినిమాపై ట్విట్టర్ లో స్పందించిన నాగార్జున
  • నాగార్జునపై గౌరవాన్ని ప్రదర్శిస్తూ పూరీ జగన్నాథ్ ట్వీట్
  • మరోసారి కాంబినేషన్ సెట్ కావడంపై ఆనందం
టాలీవుడ్ అగ్రనటుడైన నాగార్జునతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున స్పందిస్తూ, '28 సంవత్సరాల క్రితం శివ సినిమా నా లైఫ్‌ ని ఛేంజ్ చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్‌ లో సినిమా చేస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

 దీనికి వర్మ ప్రియశిష్యుడు పూరీ జగన్నాథ్ స్పందిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో "సార్.. శివ సినిమా మా జీవితాలను మార్చేసింది. నాగార్జునగారు, వర్మగారు మరోసారి కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్‌ లో మరో బ్లాక్‌ బస్టర్ చిత్రం రాబోతుంది. మేమంతా ఇప్పటికీ అన్నపూర్ణా స్టూడియోస్ ను మా ఇంటిలా భావిస్తాం. ఆ గౌరవం, ప్రేమ అలానే ఉన్నాయి. నమస్కారం" అంటూ ట్వీట్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Nagarjuna
ramgopalverma
Puri Jagannadh
movie

More Telugu News